మహేశ్‌బాబు(Mahesh Babu), కీర్తి సురేశ్(Keerthi Suresh) జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట(Sarkaru Vari Pata). యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్(Kalaa athi Song)ను మేకర్స్ రిలీజ్ చేయగా.. నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ పెన్నీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పాటలో మహేశ్ బాబు కూతురు సితార సితార, మ్యూజిక్ సెన్సేషన్ తమన్, మహేష్ బాబు ఇలా అందరూ తమ స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టారు. పెన్నీ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. నకష్ అజిజ్ పాడారు. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. కాగా, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Recent Comment