సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్నసినిమా ‘సర్కారు వారి పాట’. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి అంతకుముందు విడుదలైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. అయితే ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్‌కు సోషల్‌మీడియాలో సైతం భారీ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ పాట ఇప్పుడు తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

అంతకు ముందు కళావతి సాంగ్‌కు24 గంటల్లో 14.78 మిలియన్స్ వ్యూస్ రాగా, 22 గంటల్లో ఈ పెన్నీ సాంగ్ కి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. కాగా, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.