రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)(RRR). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(RAM CHARAN), ఆయన జోడీగా అలియాభట్ నటించింది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ అలరించింది. అయితే అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని ప్రశంసిస్తున్నారు.
అయితే నేడు రామ్‌చరణ్ బర్త్ డే కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, తన అభిమానులకు చెర్రీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశాడు. ఈ క్రమంలోనే చరణ్ తాజాగా ఓ నోట్ విడుదల చేశాడు. “దర్శకధీరుడు రాజమౌళి గారు రూపొందించిన ఆర్ఆర్ఆర్
సినిమాకు అద్భుత విజయం అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందించిన ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.”
Recent Comment