అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప, ది రూల్ చిత్రం లో మొదటి సింగల్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు గా మేకర్స్ ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.  సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మరో సారి రికార్డ్స్ బద్దలు కొట్టడానికి వస్తోంది

ప్రపంచ వ్యాప్తం గా పుష్ప ది రూల్ 15థ్ ఆగష్టు న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన మొదటి గ్లింప్స్ తో పుష్ప, ది రూల్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి