బీజేపీ నాయకుల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR ) విమర్శలు చేసారు.తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై మినిస్టర్ కేటీఆర్ (KTR)నిలదీశారు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, ప్రజా వంచన యాత్రని విమర్శించారు.తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన బీజేపీ(BJP) ఇపుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిండం సరికాదని తెలిపారు.

ఇక ఎన్నో ఏళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో(Telangana) బీజేపీ నాటకాలు ఆడుతూ పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.. బీజేపీ(BJP ) ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా చేసిందని నిందించారు.హిందు ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ దేవాలయాలకు ఎంత నిధులు ఇచ్చారు, భద్రాచలం(Bhadra chalam ), యద్రాదికి(Yadradi) ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని నిలదీశారు. కట్టుకథలు చెప్తూ ప్రజలను మోసం చేయడానికే ఇపుడు యాత్ర మొదలు పెట్టారని కేటీఆర్(KTR ) ఆరోపిస్తున్నారు.