అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Hasan) కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విక్రమ్'(Vikram). బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, మాలీవుడ్ స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఇండస్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తాజా సమాచారం ఒరకరం ఈ సినిమాలో బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్రలో న‌టించ‌బోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ సెకండాఫ్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశంలో క‌నిపిస్తాడ‌ట‌. కాగా, విక్ర‌మ్ మూవీ ఈ ఏడాది జూన్ 13 తెలుగు, త‌మిళంతోపాటు ప‌లు భారతీయ భాష‌ల్లో రిలీజ్ కానుంది.