రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda) కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ డైరెక్టర్ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’(Liger) సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో టైసన్‌ నటిస్తుండటంతో ఈ సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.

ఇక ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈ మూవీకి సాలా క్రాస్‌ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ ఫ‌స్టాఫ్ లో కోచ్ గా క‌నిపించినా ప్లాష్ బ్యాక్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు తండ్రిగా కనిపిస్తార‌ట‌. హీరో బాక్సర్, హీరో ఫాద‌ర్ కూడా బాక్స‌ర్ అన‌గానే అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి మూవీ గుర్తొస్తుంటుంది. ఆ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు లైగ‌ర్ సినిమా అలాంటి క‌థాంశ‌మే తీసుకున్న‌ప్ప‌టికీ… స్వ‌దేశీ కొడుకు, విదేశీ తండ్రిల మ‌ధ్య డ్రామాతో ఈ సినిమాను స‌రికొత్త‌గా తెరకెక్కించారని స‌మాచారం.