లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

కెప్టెన్ రాహుల్ 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు.  ఆ తరవాత వచ్చిన డికాక్, లెవీస్, మనీష్ పాండే తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు.

అయితే దీపక్ హుడా వేగం గా ఆడుతూ స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు.  దీపక్ హుడా కేవలం 33 బంతుల్లో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  ఆయుష్ బాధొని వేగం గా 19 పరుగులు చేశాడు.

సన్ రైజర్స్, హైదరాబాద్ బౌలర్ల లో సుందర్, షెఫర్డ్, నటరాజన్ తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం 170 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్, హైదరాబాద్, 25 పరుగుల వద్ద కెప్టెన్ విలియమ్సన్ వికెట్ కోల్పోయింది.  16 పరుగులు చేసిన లియమ్సన్,  అవేశ్ ఖాన్ చేతికి చిక్కాడు.

సన్ రైజర్స్, హైదరాబాద్ ఇంకా 93 బంతుల్లో 137 పరుగులు చేయాల్సివుంది