మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవమా ముంబైలో ముగిసిన షెడ్యూల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల‌పై కీలక స‌న్నివేశాలు తెరకెక్కించారు.

కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘గాఢ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ ఖాన్ తో కలిసి చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. ఇటీవల రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఓ రేంజ్ లో స్టెప్పులు వేశారు. అయితే ఇప్పుడు చిరు, సల్మాన్ కూడా గాడ్ ఫాదర్ మూవీలో వాళ్ళని మించేలా డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి వేసే స్టెప్పులు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయండంలో ఎలాంటి సందేహం లేదు