దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తూ బాక్సఫీసు దుమ్ముదులుపుతోంది. కేవలం వారం రోజల్లోనే రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌,(Ram Charan) ఎన్టీఆర్ నటనపై యావత్ సినీ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఫ్యాన్స్ తో పాటుగా,రాజకీయవేత్తలు సినీ ప్రముఖులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’విజయంలో భాగంగ ఎన్టీఆర్‌(NTR) ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అందులో ఎన్టీఆర్ ను పొలిటిక‌ల్ అరంగ్రేటం గురించి ఓ విలేకరి ప్ర‌శ్నించాడు. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ..” ప్రస్తుతం సినిమాలే నా ప్రపంచం ఓ న‌టుడిగా నా ప్ర‌యాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. భ‌విష్యత్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి నాకు రాజ‌కీయల గురించి ఆలోచించే స‌మ‌యం లేదు.” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.