నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. తన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన నాని తన నెక్స్ట్ మూవీ ‘దసరా’(Dasara)పై దృష్టి సారించాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తుండగా..
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సముద్రఖని, సాయి కుమార్, జరినా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకి సంతోష్​ నారాయణన్​ సంగీతం అందిస్తున్నారు.

తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. లుంగీ కట్టుకొని పక్కా మాస్ లుక్ లో ఉన్న నాని లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. కాగా, ఈ సినిమాలో రెండో హీరోయిన్‌ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారని సమాచారం.