మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగాగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. (Tiger Nageswara Rao) ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు మేకర్స్. కాగా, స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతుంది.

అయితే ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ ను చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వీటికి టైగర్ నాగేశ్వరరావు వేట మొదలైంది అంటూ క్యాప్షన్ జత చేశారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.