మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్ర‌లో న‌టించారు. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల‌వుతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇటీవల విడుద‌లైన సినిమా ట్రైల‌ర్‌కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇక థియేట‌ర్స్‌లో చిరంజీవి, రామ్ చరణ్ క‌లిసి చేసే సంద‌డిని చూడ‌టానికి మెగాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, అయితే ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఆచార్య సినిమా నుంచి మరో “భళే భళే బంజారా” అనే సాంగ్ ని ఈ ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ పాట గురించి చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల చర్చిస్తున్న ఒక ఆసక్తికర వీడియోని కూడా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్​చరణ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇది చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజ‌యవాడ‌లోని సిద్దార్థ జూనియ‌ర్ కాలేజ్‌లో నిర్వహించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రానున్నారు.