ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. అందులో రెండు మ్యాచ్ లు గెలిచి, ఏడింటి లో ఓడిపోయింది. పాయింట్ల పట్టిక లో ఆఖరి స్థానం లో నిలిచింది.
సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను సొంత మైదానంలో ఓడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఏడువికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశాడు. రజత్ పటీదార్ ఆటే హైలైట్. కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రజత్ పటీదార్, ఒకే ఓవర్ లో నాలుగు సిక్స్ లు బాదాడు. గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో ఉనద్కట్ మూడు వికెట్లు తీయగా, నటరాజన్ రెండు వికెట్లు తీశాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మార్కండే తలో ఒక వికెట్ తీశారు.
ఆ తరవాత సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఎనిమిది వికెట్లనష్టానికి 171 పరుగుకులకు కట్టడి చేశారు. స్వప్నిల్, కర్న్ శర్మ, గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్. యష్ దయాల్ తలా ఒక వికెట్ తీశారు. విద్వంసకారులున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను కకావికలం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, మొదటి విజయాన్ని పంజాబ్ సూపర్ కింగ్స్ పై 25th మార్చ్ న అందుకుంది. రెండవ విజయాన్ని 25th ఏప్రిల్ న సన్ రైజర్స్ హైదరాబాద్ పై అందుకుంది.
అంటే సరిగ్గా నెల క్రితం ఇదే 25 న మొదటి విజయం సాధించింది.
Recent Comment