విలక్షణ నటుడు సత్య దేవ్, అందాల భామ తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా కంప్లీట్ అయిన ఈ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు .ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా గుర్తుందా శీతాకాలం ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సత్య దేవ్ హీరోయిన్ తమన్నా కలిసి ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నెట్ లో వైరల్ అవుతుంది. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అందమైన ప్రేమ కథ అని అర్థమవుతుంది .ఈ సినిమాలో తమన్నా నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక లవర్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. యూత్ లో జరిగే సంఘటనల ఆధారంగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు నాగ శేఖర్ తెరకెక్కిస్తున్నారు.కన్నడలో హిట్ అయిన లవ్ మాక్ టెల్ కి రీమేక్ గా ఈ చిత్రం వస్తోంది.