1980-90ల జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం “ది కశ్మీర్‌ ఫైల్స్‌” (The Kashmir Files) మార్చి 11న విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కెలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సఫీసు వద్ద పెను ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఆదివారం రోజు 1.15 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన “ది కశ్మీర్‌ ఫైల్స్‌” మూవీ తాజాగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల మైలురాయిని చేరుకుంది.

ఈ క్రమంలో చిత్రబృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్ప‌టికే అందుకు సంబందించిన డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభ‌మైనట్లు తెలుస్తోంది. సినిమాలో బలమైన కథ, కథనం ఉంటే ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించకున్నా బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందనడానికి కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాయే అతి పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు.