యువ కథానాయకుడు నితిన్‌(Nithin) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam) ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్ సరసన కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఈరోజు చిత్రబృందం నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఫస్ట్ ఛార్జ్ గా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నితిన్ ఊర మాస్ లుక్ లో దుమ్మురేపుతున్నాడు. అలాగే నితిన్ వెనుకాల చూస్తే పులి వేషగాళ్ళు, ఆ వెలుగులు చిమ్మే లైట్లు చూస్తుంటే ఏదో జాతరలో ఫీస్ట్ వచ్చే ఫైట్ సీన్స్ మాదిరిగా అనిపిస్తుంది. ఇందులో జిల్లా కలెక్టర్‌ సిద్దార్థ్ రెడ్డి పాత్రలో నితిన్‌ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం మహతి స్వరసాగర్ అందిస్తున్నారు.