కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2”. నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ కు ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ మార్చి 27న జరుగనుంది. అయితే ఈ మోస్ట్ అవేయిటేడ్ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్వవహరించబోతున్నాడు. అయితే కరణ్ జోహర్ తొలిసారి ఓ దక్షినాది సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.
Recent Comment