పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల భీమ్లా నాయక్‌తో మంచి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఆయన
ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Viramallu) సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది.

అయితే తాజాగా హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా చూస్తారు. పవర్ స్టార్ ఇంత వరకూ ఆయన కెరీర్ లో చేయనటువంటి పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే పాత్ర అది” అని సాయి మాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రారంభం కాబోతోన్న షెడ్యూల్ కోసం సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఆధ్వర్యంలో భారీ సెట్లు వేయనున్నట్లు సమాచారం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది