బాహుబలి మూవీ తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ పటం లో శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శక దిగ్గజం ..
బాక్సాఫీస్‌ దగ్గర ఓటమి ఎరుగని దర్శక ధీరుడు..  ఎస్‌. ఎస్‌ రాజమౌళి.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి RRR వరకు ఆయన కెరీర్ చూసుకుంటే ఎక్కడా అపజయం ఎదురవ్వలేదు. కథాకథనాల నుంచి టెక్నాలజీ వరకు ఆయన చేసిన కనికట్టు ప్రపంచ సినీ ప్రేమికులను మంత్ర ముగ్ధులను చేసింది.
టాలీవుడ్ సృజనకు విజ్ఞులు సైతం విస్తుపోయెలా చేసిన ఈ దర్శక ధీరుడు నుంచి వచ్చిన మరో విజువల్ సెళ్యులాయిడ్ వండర్ RRR.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో తెరకెక్కిన ఈ ప్రెస్టీజియస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్
కోసం సినీ ప్రేమికులు గత కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొవిడ్ కష్టాలని అధిగమించి అహర్నిశలు శ్రమించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఆ రోజు వచ్చేసింది. మార్చ్ 25 థియేటర్స్ లో జాతర మొదలయింది. బాక్స్ ఆఫీస్ లో రికార్డుల మోత మొదలైంది.
మరి .RRR ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించిందో..ఆ చిత్ర విశేషాలపై ఓ సమగ్ర విశ్లేషణ డార్లింగ్ మీడియా ప్రేక్షకులకు ప్రత్యేకం.

సినిమా: ఆర్‌ఆర్‌ఆర్‌
నటీనటులు: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌, శ్రియ,రేస్టీవెన్‌ సన్‌. సముద్రఖని, ఓలివియా మోరిస్‌,
కథ: విజయేంద్ర ప్రసాద్‌
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
మ్యూజిక్ : స్వర వాణి ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
ప్రొడ్యూసర్ : డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : ఎస్‌.ఎస్‌.రాజమౌళి
రిలీజ్ డేట్: 25 మార్చ్ 2022

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అర్ అర్ అర్ ..గత కొంత కాలంగా ఈ పేరు అనని , వినని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
అంతలా ప్రజల మనసుల్లో నాటుకు పోయిన ఈ పేరు వెనుక దర్శక ధీరుడు రాజమౌళి కృషి అభినందనీయం. గెలుపెరిగిన ఆయన శైలికి ప్రపంచ సినిమా నీరాజనాలు పలుకుతోంది.
ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ కబినేసన్ అంటే ప్రేక్షకుల్లో ఉక్తంట కామన్. అలాంటిది తెలుగు సినిమా లో భారీ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్స్ తో సినిమా అంటే అంచనాలు ఎవరెస్ట్ ను తాకుతాయి.ట్రిపుల్ అర్ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ దాటి ఆ తరువాత వచ్చిన ప్రతి టీజర్ , ట్రైలర్ ,సాంగ్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఈ సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటి కలిగించాయి.
అందులోనూ ఇద్దరు విప్లవ యోధులయిన అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనువిందు చేయడం తో ఆ అంచనాలు ఎవరెస్ట్ ను మించిపోయాయి.
అర్ అర్ అర్ చిత్ర
కథ విషయానికి వస్తె..
నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ కథ మొదలైంది. 1920 బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్‌ చరణ్‌) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఇక నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర (రే స్టీవెన్‌సన్‌) ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాపరి లాంటి కొమరం భీమ్ (ఎన్టీఆర్‌)కి ఈ విషయం తెలుస్తింది.
ఢిల్లీకి వెళ్లిన కొమురం భీమ్.. తమగూడెం పిల్ల కోసం దొరలపై తిరుగుబడి చిన్నారిని రక్షిస్తాడు. దాంతో కొమురంను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుకు అప్పగిస్తోంది. అయితే కొమురం నిజాయితీ, మంచితనం నచ్చిన రామరాజు అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. రామరాజును కొమురం కాపాడుతాడా లేదా?.. వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది?.. బ్రిటిష్ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం జరిగింది? అనేది ఖచ్చితంగా వెండితెరపై వీక్షించి ఆ అనుభూతి పొందాల్సిందే.
ఇక .నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తె..ఈ చిత్రంలో
మొదటగా చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల నట విశ్వరూపాన్ని గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన పీక్స్.
ఈ ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ , భారీ పోరాట సన్నివేశాల్లో ఈ నటులు చాటిన సత్తా సగటు ప్రేక్షకుల గుండెను తాకాయి.
ఇక.
ఇక ‘నాటు నాటు’ పాటలో అయితే తమ డ్యాన్సులతో ఈ స్టార్స్ ఇద్దరూ చెలరేగిపోయిన తీరు ఓ వండర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఓవరాల్ గా చెప్పాలంటే యన్ టి ఆర్ , రామ్ చరణ్ ఇద్దరూ తమ నటనతో అర్ అర్ అర్ సినిమాకు ప్రాణ ప్రతిష్ట చేశారు.

ఇక ..హీరోయిన్ విషయానికి వస్తె బాలీవుడ్ స్టార్ అలియా భట్‌ సీత పాత్రలో ఒదిగిపోయింది.తనకిధి టైలర్ మేడ్ కారెక్టర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
బాలీవుడ్ స్టార్
అజయ్ దేవగణ్ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకం. శ్రియ తన పరిధిలో మంచి నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రావురమేష్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేర చక్కటి నటన ప్రదర్శించారు.

ఇక..సాంకేతిక అంశాల గురించి రాజమౌళి సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రాజమౌళి అస్తాన ఛాయాగ్రాహకుడు సెంథిల్ స్టన్నింగ్ విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లాయి.
ప్రతీ సీన్ లో సోల్ కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఇక.. ఎం ఎం కీరవాణి సంగీతం గురించి చెప్పాల్సిన పనే లేదు.
రాజమౌళి అబిరుచితో పాటు కథానుగునంగా .. ప్రెజెంట్ ట్రెండ్ కు కనెక్ట్ చేస్తూ పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వడం లో కీరవాణిని మించిన వారు లేరు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే తరాలు మారుతున్నా సరే..తన సంగీతం తో నేటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ ఎలివేషన్ లో కీరవాణి నేపథ్య సంగీతం కీలకం.
బుర్ర సాయి మాధవ్ తూటాల్లాంటి మాటలు ప్రతీ గుండెను తాకుతాయి.
రాజమౌళి సినిమాలు అనగానే విజువల్ ఎఫెక్ట్స్ భారీ గా ఉంటాయి అని థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకులకు పండగే పండగ.
డి వి వి దానయ్య నిర్మాణం లో వచ్చిన ఈ చిత్రం రాజీ పడని
నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి.

ట్విస్ట్
ఈ చిత్రం లో ఇంటర్వెల్ ముందు వచ్చే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ పోరాట సన్నివేశం ఎవరూ ఊహించరు.ఒక్కసారి ప్రేక్షకులకు ఘుస్ బంప్స్ వచ్చేస్తాయి.

రాజమౌళి ఏ వాళ్ళ కన్నా అది ఓ విజువల్ వండర్ లానే ఉంటుంది
ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంతే . ఇంతటి అద్భుత కలను సెల్యులాయిడ్ అంతకంటే అద్భుతంగా ఆవిష్కరించడంలో రాజమౌళి & టీమ్ సక్సస్ అయింది.

ప్రేక్షకులు ఎక్కడ ఏం కోరుకుంటారో అవన్నీ పక్కాగా జోడిస్తూ ఈ సినిమాని తూకం వేసి మరీ తీర్చిదిద్ది ..సినీ ప్రేమికులు కాలరెగరేసే సినిమాను అందించారు.
హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన ఈ చిత్రం
ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్‌ లుక్‌లో కనువిందు చేసింది.

ప్లస్ పాయింట్స్;

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ నటన
కథ, పోరాట ఘట్టాలు
రాజమౌళి ఔట్ స్టాండింగ్ టేకింగ్ మార్క్,
సెంథిల్ కుమార్ విజువల్స్
కథలో కీలక మలుపులు

మైనస్ పాయింట్స్;
సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువైన ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.కొన్ని సన్నివేశాల్లో కథాగమనం స్లో అనిపిస్తుంది తప్ప RRR కి ఎక్కడా ఎలాంటి డోకా లేదు.బాక్సాఫీస్ వద్దే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన తడాఖా చూపించే సినిమా ఇది అని టాలీవుడ్ సగర్వంగా చెప్పొచ్చు

రేటింగ్:
8.5/10

Writer : Srinivas Nedunuri