కన్నడ అగ్రకథానాయకుడు యశ్(Yash) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్-2″(KGF Chapter 2) 2018లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందింది.హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విలన్ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పోషించాడు.
అయితే ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన ‘కేజీఎఫ్-2’ మూవీ తొలి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. మొదటిరోజే రోజే దాదాపు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డులను సాధించింది. అయితే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఖరారు చేశారట మేకర్స్. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయాలనీ ముందుగానే నిర్నయాచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మే 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ‘కేజీఎఫ్-2’ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ఈ చిత్రం శాటి లైట్ హక్కులను జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రం టెలివిజన్ లో ప్రసారం కావాలంటే 90 రోజులు ఆగాల్సిందే.
Recent Comment