పదే పదే జనసేన నేతను ప్యాకేజీ అంటున్నారు వై స్ ర్ సీ పీ నేతలు. ప్యాకేజీ అన్న మాట అంటే వై ఎస్ ర్ సీ పీ నేతలకు ఎందుకంత ఇష్టం. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటున్నట్లు గా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేదు. మరి ఎందుకు జనసేన నేతను పదే పదే ప్యాకేజీ స్టార్ అని ఎందుకు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను మానసికంగా కృంగతీయడానికేనా. వై ఎస్ ర్ సీ పీ నేతలలో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జైలుకు వెళ్లొచ్చారు. విజయసాయి రెడ్డి మీద కూడా కేసులున్నాయి.
అసలు మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ కే అంటున్నారు. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయరా. అసలు రాజధాని చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి. విశాఖపట్టణం లాంటి ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయం చెప్పలేకపోయారు. నేతలంతా విడతల వారీగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తిడుతూనే ఉన్నారు. విశాఖ గర్జన అంటే ఇదేనేమో. ప్రత్యేకాంధ్ర గురించి ఇప్పుడు జగన్ మాట్లాడలేకపోతున్నారు. మోడీ జగన్ కేసులు తిరగతోడతారేమో అన్న భయం. రాజధాని గా ఒకప్పుడు అమరావతి ని ఒప్పుకున్నా జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అని ఎందుకు అంటున్నరు అన్న విషయం అందరికి అర్ధం అయ్యేలా చెప్పాల్సి ఉంది. విశాఖపట్టణం లాంటి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి ఎలా చేస్తారు అనేది ప్రజలకు వివరించాలి. అధికార పార్టీ ఏమి చేసినా నడుస్తుంది, ఎవర్ని తిట్టినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటే.
నేతల భూముల విలువలు పెంచుకోవడానికేనా ఈ మూడు రాజధానులు…కాలమే సమాధానం చెప్పాలి. వై ఎస్ ర్ సీ పీ లో కూడా ప్యాకేజీ స్టార్ లు ఉన్నారేమో ఎందుకంటే ప్యాకేజీ …..ప్యాకేజీ అన్న మాట అంటే వాళ్లకు బాగా ఇష్టం
Recent Comment