యంగ్ హీరో నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. (Krishna Vrinda Vihari) అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ సింగర్‌ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి చక్కటి స్పందన లభించింది. ఈ క్రమంలో ‘వర్షంలో వెన్నెల’ అనే ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ‘వర్షంలో వెన్నెల’ పాటను శనివారం ఉదయం 11.09 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. కాగా, ఈ సినిమాకి సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్‌ 22న
విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస‍్తున్నారు. కాగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.