రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు, కెప్టెన్ డుప్లెసిస్ చెలరేగి ఆడడం తో, రెండు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

డుప్లెసిస్ ఏడు సిక్సర్లు మూడు ఫోర్ల సాయంతో కేవలం 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు.  ఆ తరవాత వచ్చిన విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ కూడా చెలరేగి ఆడారు.  విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 41 పరుగులు,  దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు చేశారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ తలా వికెట్ తీశారు.

అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యం తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 71 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు.

మయాంక్ అగర్వాల్ 32 పరుగులు చేయగా, శిఖర్ ధావన్, రాజపక్స చెలరేగి పోయారు.  , శిఖర్ ధావన్ 29 బంతుల్లో 43 పరుగులు, రాజపక్స 22 బంతుల్లో 43 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ గెలుపు మార్గం సుగమం చేశారు.  ఆ తరవాత వచ్చిన లివింగ్ స్టోన్, షారుఖ్ ఖాన్ కూడా బ్యాట్ ఝుళిపించారు.

ఆఖర్లో ఒడియాన్ స్మిత్ కేవలం 8 బంతుల్లో 25 పరుగులు (3×6, 1×4) చేసి, ఇంకా ఒక ఓవర్ మిగిలి వుండగానే పంజాబ్ సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించారు

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు బౌలర్లలో, సిరాజ్ 2 వికెట్లు తీయగా, అక్షదీప్, హాసరంగా, హర్షల్ పటేల్ తలా వికెట్ తీశారు

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ :  ఒడియాన్ స్మిత్