పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). సీనియర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనుంది.
అయితే ఈరోజు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ సరికొత్ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ లుక్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి. చాలా రోజుల నుంచి ఈ మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న పవర్ స్టార్స్ ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తుందని చెప్పొచ్చు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ఇటీవలే ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చిత్రబృందం భావిస్తున్నారట
Recent Comment