ప్రస్తుతం RRR మూవీ సక్సెస్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల విరామం తర్వాత సీనియర్ దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. చాలా రోజుల కిందటే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వెలువ‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ విరమంలో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఏనాడు ఇలాంటి దీక్ష చేపట్టని ఎన్టీఆర్ తొలిసారిగా హనుమాన్ దీక్షను చేపట్టాడు.
తాజాగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్షతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాషాయ వస్త్రాలు, మెడలో మాల, నుదిటిన కుంకుమ తో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. కాగా, 21 రోజులపాటు ఎన్టీఆర్‌ ఈ దీక్షలో ఉండబోతున్నట్టు సమాచారం. కాగా, ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.