కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్’ ( Beast Movie ). నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నైజాంలో రూ 3.50 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా.. ఏపీలో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘బీస్ట్’ మూవీ 10కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది. ‘బీస్ట్’ మూవీ తెలుగులో విజయం సాధించాలంటే రూ.10.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేయాలి.
Recent Comment