మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై ట్రైలర్, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.
అయితే ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎక్కడా కనిపించలేదు. పూజా హెగ్డే మాత్రమే కనిపించింది. దీన్నిబట్టి చూస్తే కాజల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. కాజల్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో చేరిన వెంటనే కరోనా రావడం ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అని తేలడంతో చాలా వరకు ఈ షూటింగ్ లో ఆమె పాల్గొనలేదు. కాజల్ సరిగ్గా డేట్స్ ఇవ్వకపోవడంతో చిత్రబృందం కూడా అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. దాంతో ఆచార్య మూవీలో కాజల్ నటించిన కొన్ని సీన్స్ ను డిలీట్ చేశారని తెలుస్తోంది. మరి ఎన్ని సీన్లు తీసేశారో తెలియాలి అంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Recent Comment