ముందుగా ప్రచారం చేస్తున్నట్టుగా జియో సినిమా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది.  OTT రంగం పై పట్టు సాధించాలన్న తపన కనిపిస్తోంది.

కేవలం నెలకు 29 రూపాయలతో జియో సినిమా సబ్ స్క్రిప్షన్  పొందవచ్చు.

  • ఒక డివైస్ లో ఎలాంటి ప్రకటనలు  లేకుండా కంటెంట్ ను చూడవచ్చు.
  • అది కూడా 4కే క్వాలిటీ లో
  • అంతే కాదు మనం ఆ కంటెంట్ ను డౌన్ లోడ్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ లైన్ లో కూడా చూడవచ్చు

ఇది కాకుండా ఒక ఫామిలీ ప్లాన్ ను ప్రవేశ పెట్టింది.  నెలకు సబ్ స్క్రిప్షన్, కేవలం 89 రూపాయలు

  • ఈ ఫామిలీ ప్లాన్ తీసుకోవడం వాళ్ళ, నాలుగు డివైస్ లలో కంటెంట్ చూడవచ్చు. 
  • 29 రూపాయల ప్లాన్ కు ఏమి వర్తిస్తాయో, 89 రూపాయల ప్లాన్ కు అవన్నీ వర్తిస్తాయి.  కేవలం డివైస్ ల సంఖ్య పెరిగింది

ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రీ ఆఫర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలతో ఐపీల్ ను ఉచితంగా చూడవచ్చు.  ప్రస్తుతం జియో సినిమా ప్రీమియం ఉన్నవారు ఈ ఫామిలీ ప్లాన్ కిందకు వస్తారు