యువకథానాయకుడు నాగశౌర్య (Naga Shourya) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. (Krishna Vrinda Vihari) అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ సింగర్ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి చక్కటి స్పందన లభించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ‘వర్షంలో వెన్నెల’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’అంటూ ట్వీట్ చేస్తూ సమంత ఈ సాంగ్ కు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని అధికారిక ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ పాటని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే పాడగా, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస‍్తున్నారు. కాగా, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్నారు.
Recent Comment