దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఈ 12 రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ 12 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్..

★తొలి రోజు – 74.11 కోట్లు
★రెండో రోజు – 31.63 కోట్లు
★ మూడో రోజు – 33.53 కోట్లు
★ నాలుగో రోజు – 17.73 కోట్లు
★ ఐదో రోజు – 13.63 కోట్లు
★ ఆరో రోజు – 9.54 కోట్లు
★ ఏడో రోజు – 7.48 కోట్లు
★ ఎనిమిదో రోజు – 8.33 కోట్లు
★ తొమ్మిదో రోజు – 19.62 కోట్లు
★ పదో రోజు – 16.10 కోట్లు
★ పదకొండో రోజు11- 4.98 కోట్లు
★ పన్నెండో రోజు- 4.88 కోట్లు షేర్ (7.85 కోట్లు గ్రాస్‌)

కలెక్షన్స్ పరంగా పలు రికార్డ్స్ తిరగరాసిన ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా నైజాం సంచలనం సృష్టించింది. తాజాగా ఈ మూవీ12వ రోజుకి గాను 2.1 కోట్ల షేర్ ని అందుకొని నైజాంలో మొదటి సారిగా 101 కోట్ల షేర్ మార్క్ ని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి 12 రోజుల్లో521.06 కోట్లు షేర్‌, ( 938.50 కోట్ల గ్రాస్‌) కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా హిందీలో 97.10 కోట్లు, కర్నాటకలో 38.70 కోట్లు ,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.75 కోట్లు, అలాగే తమిళనాడులో 34.90 కోట్లు, కేరళలో 9.75 కోట్లు, ఓవర్సీస్‌లో 88.70 వసూలు చేసింది.