దేశంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

బీజేపీ ప్రభుత్వం హనుమాన్జీ చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశంలో నాలుగు దిక్కులలో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రారంభించాలని సంకల్పం పెట్టుకుంది.దీనిలో భాగంగా పశ్చిమ రాష్ట్రం గుజరాత్ లో మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది.ప్రధాని మోడీ ఇపుడు హనుమాన్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ మారింది.