యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాక్సఫీసు మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో భారీ విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

సరైన ప్రమోషన్స్ జరపకపోవడంతో ప్రేక్ష‌కులకు ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుదలైన సంగతే తెలియదు. ఈ క్రమంలోనే ఈ సినిమాని త్వ‌ర‌లోనే ఓటీటీలోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 8న విడుద‌లైన ఈ చిత్రం ఏప్రిల్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై త్వర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా ఈ సినిమాలో క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా కీల‌క‌పాత్ర‌లు పోషించిన సంగతి తెలిసిందే.