రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.   మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

ఓపెనర్ జొస్ బట్లర్ అద్భుతం గా ఆడి కేవలం 47 బంతుల్లో 70 పరుగులు చేశాడు.  బట్లర్ ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు ఉన్నాయి, ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు.  మరో ఓపెనర్ జైస్వాల్ 4 పరుగులకే ఔట్ అయ్యాడు.  శాంసన్ 8 పరుగులకే ఔట్ కాగా, పడిక్కల్ 37 పరుగులతో పరవాలేదనిపించాడు.

హేట్మెయిర్ 31 బంతుల్లో 42 పరుగులు చేసి  బట్లర్ కు చక్కని సహకారాన్ని అందించాడు.  బట్లర్, హేట్మెయిర్ నాలుగవ వికెట్ కు అజేయం గా 83 పరుగులు జోడించారు.  బట్లర్, హేట్మెయిర్ జోడి, ఆఖరి రెండు ఓవర్ ల లో 42 పరుగులు చేశారు

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు బౌలర్ల లో విల్లి, హాసరంగా, హర్షల్ పటేల్ లు తలా ఒక వికెట్ తీశారు.