నటసింహం నందమూరి బాలయ్య(Bala Krishna) కథానాయకుడుగా యువ దర్శకుడు గోపిచంద్‌ మలినేని(Gopichand Malineni) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో ఆకట్టుకోనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ‘NBK107’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ (Duniya Vijay) విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ తండ్రీ కొడుకులుగా క‌నిపిస్తార‌ని స‌మాచారం. అందులో భాగంగా కొడుకు పాత్రపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి చిత్రబృందం మే నెల‌లో అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో యంగ్ బాలయ్యపై దర్శకుడు గోపీచంద్ కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో బాల‌కృష్ణ పోషిస్తున్న రెండు పాత్ర‌ల్లో ఓ పాత్ర‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో బాల‌కృష్ణ రెండో పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందించారు.