దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదల అయింది.

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ఎన్టీఆర్‌ , కళ్యాణ్ రామ్ కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమా చూడగా భ్రమరాంబ రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య అభిమానులతో కలిసి ఈ సినిమా చూశారు. అయితే సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్‌ బయటకు వస్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.