పాన్ ఇండియా స్టార్‌ ​ప్రభాస్‌(Prabhas) ప్రస్తుతం కెజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‌’ (Salaar) సినిమాలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ ఆద్య పాత్ర పోషిస్తోంది. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్‌రూర్‌ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబాలే ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే సలార్ చిత్రానికి సంబంధించి 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇక సలార్ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేసి, 2023 ఏప్రిల్‌లో నుంచి జూన్‌ మధ్యలో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటికైనా సలార్ మూవీ విడుదల తేదిపై ఓ స్పష్టత రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.