దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతగా 25రోజులు పూర్తి చేసుకున్న RRR సినిమా కలెక్షన్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ సినిమా KGF2తో పోటీ పడి మరీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ క్రమంలోనే 25వ రోజుకుగాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ. 36 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ 25 రోజుల్లో 264.20 కోట్ల నెట్, 398.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చూస్తే ఈ 25 రోజుల్లో 588.04 కోట్ల షేర్‌, 1087 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. RRR మూవీ రిలీజ్ కు ముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్చేయగా.. ప్రస్తుతం 135 కోట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది.