మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. (Tiger Nageswara Rao) తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆ రోజు మ‌ధ్యాహ్నం 12:06 గంట‌ల‌కు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నుపూర్ సనన్ రవితేజకు జోడీగా నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు చిత్రబృందం.

కాగా, స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతుంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.