పాట్ కమ్మిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్.  సన్ రైజర్స్ యాజమాన్యం వేలంలో 20 కోట్లకు సొంతం చేసుకుంది.  ఆస్ట్రేలియా కు వరల్డ్ కప్ అందించిన విజయవంతమైన కెప్టెన్. సన్ రైజర్స్ యాజమాన్యం వెంటనే కెప్టెన్ పదవి కూడా ఇచ్చారు.

కెప్టెన్సీ మార్పు ప్రభావమో ఏమో, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో చెలరేగిపోతోంది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛత్రిత్రలో నే అత్యధిక పరుగుల రికార్డు ను సొంతం చేసుకుంది.  ఆడిన ఏడు మ్యాచ్ ల్లో,  ఐదు గెలిచి 10 పాయింట్ల తో, పాయింట్ల పట్టిక లో, మూడవ స్థానం లో ఉంది.   సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున, పాట్ కమ్మిన్స్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు

ఈ మధ్యనే పాట్ కమ్మిన్స్ , మహేష్ బాబు కలుసుకున్నారు. పాట్ కమ్మిన్స్ తనదైన స్టైల్ లో పోకిరి, పుష్ప లో డైలాగులు చెప్పడమే కాకుండా, చివర్లో పవన్ కళ్యాణ్ ను అనుకరించారు.  మీరు ఈ వీడియో ని చూసి ఎంజాయ్ చేయండి.