టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలను బిజీగా ఉన్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో రెండు సూపర్ హిట్స్‌ ఖాతాలో వేసుకున్న ఈ లవర్ బాయ్.. ప్రస్తుతం తెలుగులో ‘థాంక్యూ’, హిందీలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ‘దూత’ పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

ఇలా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న నాగ చైతన్య తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు. తొలిసారి ఆయన తెలుగు, తమిళం భాషల్లో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగచైతన్య కెరీర్ లో 22వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు వెంకట్‌ ప్రభు విషయానికొస్తే.. సరోజ, గోవా, పార్టీ, గ్యాంబ్లర్, బిర్యానీ, రాక్షసుడు, మానాడు వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ యాక్షన్ మూవీస్‌తో ఆకట్టుకున్నారు వెంకట్‌ ప్రభు.