అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప, ది రూల్ చిత్రం లో మొదటి సింగల్ ను మేకర్స్ విడుదల చేశారు.

అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన మొదటి గ్లింప్స్ తో పుష్ప, ది రూల్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.  సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మరో సారి రికార్డ్స్ బద్దలు కొట్టడానికి వస్తోంది

పుష్ప,పుష్ప టైటిల్ సాంగ్ ని ప్రోమో రిలీజ్ చేశారు. పూర్తి పాట ను  1st May ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేస్తారు

ప్రపంచ వ్యాప్తం గా పుష్ప ది రూల్ 15th ఆగష్టు న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.