కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’ ( Beast Movie ). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఈ చిత్రం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో ఏప్రిల్ 13న విడుద‌ల కానుంది. అయితే బీస్ట్ సినిమా విడుదలకు ముందు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో ఉగ్రవాదులు, ఇస్లామిక్ టెర్రరిస్ట్‌లు గురించి ప్రస్తావించడంతో.. కువైట్, ఖతార్ వంటి దేశాలు ఈ సినిమాను అక్కడ విడుదలవకుండా బ్యాన్ చేశాయి. అంతకుముందు దుల్క‌ర్ స‌ల్మాన్ నటించిన కురుప్‌ మూవీ, విష్ణు విశాల్ నటించిన ఎఫ్ఐఆర్ సినిమాలను కూడా కువైట్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.