పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం మంచి స్పీడు మీదున్నాడు. వరుసగా సినిమాలను అంగీకరిస్తూ ముందుకెళ్తున్నాడు. అటు రాజకీయాలను చేసుకుంటూనే ఇటు సినిమా షూటింగ్‌లలో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్‌తో మంచి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఆయన
ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Viramallu) సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
అయితే గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Recent Comment