యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కథనాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) చిత్రం​ శుక్రవారం(మార్చి25)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏ థియేటర్స్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. భారీ అంచనాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ విజ‌య‌వంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కులు, సినీ నటులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా స‌క్సెస్‌పై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో తన రివ్యూను పంచుకున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్ ఒక మాస్టర్ పీస్ మూవీ. రాజమౌళి నుంచి వచ్చిన మరో అద్భుతం ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్’ అంటూ చిత్రబృందంపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఈ మెగా స్టార్ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.