నటసింహం నందమూరి బాలయ్య(Bala Krishna) కథానాయకుడుగా యువ దర్శకుడు గోపిచంద్‌ మలినేని(Gopichand Malineni) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో ఆకట్టుకోనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ‘NBK107’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. అయితే ప్రస్తుతం సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే అక్కడ ఓ షెడ్యూల్​ను పూర్తిచేసుకుని మరో యాక్షన్ షెడ్యూల్​ను కూడా ప్రారంభించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ​ షెడ్యూల్ కూడా విజయవంతంగా​​ పూర్తైనట్లు తెలుస్తోంది. ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బాలకృష్ణ, ఇతర నటులపై పోరాట సన్నివేశాలు తెరకెక్కించినట్లు సమాచారం. ఇక ఈ​ షెడ్యూల్​​ పూర్తవడంతో మరో కొత్త షెడ్యూల్​ ​ను హైదరాబాద్​లో ప్రారంభించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ (Duniya Vijay) విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందించారు. కాగా, వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.