పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాతో ఇటీవల అభిమానుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలు ఆయన చేయబోతున్నాడు. వీటితో పాటు ప్రభాస్‌ యువ దర్శకుడు మారుతీ డైరెక్షన్ లో కూడా ఓ పాన్‌ ఇండియా మూవీ చేయనున్న విషయం తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో
ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నారు.

వీరిలో రాశిఖన్నా, మాళ‌విక మోహ‌న్ ఇప్పటికే ఫిక్స‌య్యార‌ని స‌మాచారం. అయితే కామెడీ, హార్ర‌ర్ నేప‌థ్యంలో రూపొందనున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బోమన్ ఇరాని ఓ కీలక పాత్రలో క‌నిపిస్తార‌ని వ‌ర్గాల్లో స‌మాచారం. ఇక ఈ మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్‌ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. ఇందుకు గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్‌ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట.