ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న RRR మూవీ సక్సెస్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల గ్యాప్ తర్వాత సీనియర్ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. చాలా రోజుల కిందటే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వెలువ‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ( Deepika Padukone ) న‌టిస్తుంది.

యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీం పాత్ర కోసం రఫ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. తాజాగా ఎన్టీఆర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎన్టీఆర్ కొద్దిగా సన్నబడినట్లు కనిపిస్తున్నాడు. ట్రిమ్ చేసిన గడ్డంతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.