ఈ వేసవి లో థియేటర్ లో హడావిడి తగ్గింది. అయితే ప్రేక్షకులకు వరసగా 3 చిత్రాలు OTT లో రిలీజ్ అవుతున్నాయి.
గోపీచంద్ యాక్షన్ మూవీ ‘భీమా. ఈ నెల 25నుండి హాట్ స్టార్. ఈ నెల 26 నుండి టిల్లు స్క్వేర్ Netflix లో స్ట్రీమింగ్ అవబోతోంది. విజయ దేవరకొండ ఫామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 26 నుండి స్ట్రీమ్ అవబోతోంది.
గోపీచంద్ యాక్షన్ మూవీ ‘భీమా’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యామిలీ స్టార్ విజయదేవర కొండా ఖాతాలో వరుసగా 3 వ ప్లాప్ సినిమాగా నిలిచింది
జొన్నలగడ్డ సిద్ధూ (Jonnalagadda Siddu) కధానాయకుడి గా వచ్చిన టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ (Anupama) కధానాయిక. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రాన్ని చూసి యూనిట్ ను అభినందించారు. ముఖ్యంగా యువతను విశేషం గా అలరించిందని చెప్పాలి. టిల్లు స్క్వేర్ గతంలో వచ్చిన DJ Tillu కి సీక్వెల్.
ఈ 3 సినిమా ల (‘భీమా, టిల్లు స్క్వేర్¸ ఫ్యామిలీ స్టార్) శాటిలైట్ హక్కులను స్టార్ మా (Star Maa) వారు దక్కించుకున్నారు.
Recent Comment