జొన్నలగడ్డ సిద్ధూ (Jonnalagadda Siddu) కధానాయకుడి గా వచ్చిన టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ (Anupama) కధానాయిక. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రాన్ని చూసి యూనిట్ ను అభినందించారు. ముఖ్యంగా యువతను విశేషం గా అలరించిందని చెప్పాలి. టిల్లు స్క్వేర్ గతంలో వచ్చిన DJ Tillu కి సీక్వెల్.
ఈ సినిమా శాటిలైట్ హక్కులు స్టార్ మా (Star Maa) వారు దక్కించుకున్నారు. అయితే టిల్లు స్క్వేర్ డిజిటల్ హక్కులు Netflix వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం Netflix లో ఈ నెల 26 న ప్రీమియర్ చేస్తున్నారు.
Recent Comment